వినాయక మంటపాల ఏర్పాటులో జాగ్రత్తగా ఉండండి

వినాయక మంటపాల ఏర్పాటులో జాగ్రత్తగా ఉండండి

వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలో వినాయక చవితి పండుగ నేపథ్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ఎస్పీ కోటిరెడ్డి హాజరయ్యారు.  వినాయక మంట పాలను ఏర్పాటు చేసే నిర్వాహకులకు తగు సలహాలు సూచనలు చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి  పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పి శేఖర్ గౌడ్, సిఐ రాజేందర్ రెడ్డి, వివిధ మతాలకు చెందిన కుల పెద్దలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.