భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనం లేదు

భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనం లేదు
  • ఉత్తర ద్వార దర్శనం లేదు.. తెప్పోత్సవానికి రావొద్దు 
  • వైకుంఠ ఏకాదశి నాడు భద్రాద్రిలో భక్తులకు పర్మిషన్​లేదు
  • కలెక్టర్​ అనుదీప్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి టెంపుల్​లో నిర్వహించే ముక్కోటి  వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం, తెప్పోత్సవానికి భక్తులకు పర్మిషన్​ లేదని కలెక్టర్​ అనుదీప్​ తెలిపారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్​ నేపథ్యంలో భద్రాచలం దేవస్థానంలో ఈ నెల 12న నిర్వహించనున్న తెప్పోత్సవంతో పాటు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతించడం లేదని అన్నారు. శాస్త్రోక్తంగా కొద్ది మంది అర్చకులు, వేదపండితుల, స్టాఫ్​ సమక్షంలో అంతరంగికంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆన్​లైన్​ లో టికెట్లను బుక్​ చేసుకున్న వారికి తిరిగి క్యాష్​ చెల్లిస్తామన్నారు. తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం భద్రాచలం రావద్దని సూచించారు. కొవిడ్​ నియంత్రణలో భాగంగా ఈ నెల 10వ తేదీ వరకు గవర్నమెంట్​ఆంక్షలు విధించిందన్నారు. అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించినట్టు చెప్పారు.