చార్జీల పెంపుపై జనాల నుంచి వ్యతిరేకత లేదు

చార్జీల పెంపుపై జనాల నుంచి వ్యతిరేకత లేదు

రాష్ట్ర ప్రభుత్వ విప్​లు కర్నె, గువ్వల

హైదరాబాద్, వెలుగు: బస్ చార్జీల పెంపుపై ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్​ లు కర్నె ప్రభాకర్, గువ్వాల బాలరాజు అన్నారు. చార్జీల పెంపుపై కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆందోళనలకు ప్రజల మద్దతు లేదన్నారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీలో ప్రభాకర్, బాలరాజు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో ఇదే కాంగ్రెస్ నాయకులు బస్ చార్జీలు ఎందుకు పెంచలేదని ప్రశ్నించి ఇప్పుడు మాటమార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు ఆ పార్టీ నేతలే దూరంగా ఉన్నారన్నారు. కాగా, అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ కుటుంబాన్ని ఎప్పుడు పరామర్శించాలో సీఎం కేసీఆర్ కు తెలుసని బాలరాజు అన్నారు. కేసీఆర్ కంటి తుడుపు చర్యలు చేయరని, అన్ని విషయాలు తెలుసుకుని వెళ్తారన్నారు. ‘ఇన్ని గంటలు గడిచినా కేసీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శకు వెళ్ల లేదని లెక్కలు వేసిన వారు తమ సీట్లు తగ్గించుకున్నారు. ప్రజల చీత్కారానికి గురయ్యార’ని అన్నారు.