కనిపించే ప్రాణిని చంపుకుని తినే భయంకర రూపం మొసలి సొంతం. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే మొసలి ప్యూర్ వెజిటేరియన్ పైగా ఇది ఒక గుడికి కాపలా ఉంటోంది. భక్తులు పెట్టే ప్రసాదం తప్ప.. కొలనులోని చేపలను అస్సలు ముట్టుకోదు. ఈ వింతను చూడాలంటే కేరళలోని అనంతపురం గ్రామానికి వెళ్లాల్సిందే..
దేవాలయంలో ప్రసాదం అంటే చాలా పవిత్రంగా చూస్తాం.. అస్సలు కింద పడకుండా.. చాలా జాగ్రత్తగా కళ్లకు అద్దుకొని నోట్లో వేసుకుంటాం.. ఒక వేళ పొరపాటు కింద పడితే.. తొక్కకుండా తీసి..ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో అంటు చెట్లమొదట్లో కాని.. నీళ్లలో కాని వేస్తాం.. అయితే సాధరణంగా జంతువులకు ప్రసాదాన్ని పెట్టరు.. ఎందుకంటే అవి తింటాయో లేదో తెలియదు. పైగా అవి ఎక్కువుగా మాంసాహారం అంటే ఇష్టపడతాయి.. కాని కేరళలో ఓ చెరువులో ఓ జంతువు అంటే అట్టాంటి ఇట్టాంటి జంతువు కాదండోయ్..అందితే చాలు చటుక్కొని లాక్కుపోయి.. మింగేస్తుంది. అదే నండి మొసలి.. కాని కాని కేరళలో అనంతపద్మనాభుడి సన్నిధిలో ఉండే మొసలి మాత్రం పూర్తిగా శాకాహారమే తింటుంది. భక్తులు ఇచ్చిన ప్రసాదాలను తిని జీవిస్తుంది.
తిరువనంతపురంలోని అనంతపద్మనాభుడ్నిట్రావెన్ కోర్ రాజులు వంశపారంపర్యంగా కొలుస్తూ వస్తున్నారు. కానీ, కాసర్ గోడ్ లోని అనంత సరోవర మందిరంలో కొలువైన అనంతపద్మనాభుడికి ఒక మొసలి కాపలాగా ఉంటోంది. దాని పేరు బాబియా. ఇది పూర్తిగా శాకాహారి. బియ్యంతో స్వామివారికి చేసే ప్రసాదాన్ని భక్తులు దీనికి పెడ్తారు. కొలనులోని చేపల జోలికి అస్సలుపోదు. ఈ మొసలి వందల ఏళ్లుగా ఇక్కడ ఉంటోందట. స్వాతంత్య్రానికి పూర్వం ఒక బ్రిటీష్ దొర ఈ మొసలిని కాల్చి చంపాడని, ఆ పాపం చుట్టుముట్టి పాము కాటుకి అతను చనిపోయాడని స్థానికులు చెప్తుంటారు. అయితే కొన్నాళ్లకు ఆ మొసలి మళ్లీ ఆ గుడి కొలనులోనే ప్రత్యక్షమైందట.
►ALSO READ | Hair Beauty: మెరిసె కురులు.. అందానికి ప్రతీక .. సమ్మర్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
ఎన్నో ఏళ్లుగా కొలనులో ఉంటున్న ఆ మొసలిని దైవస్వరూపంగా అక్కడి ప్రజలు కొలుస్తున్నారు. అయితే హేతువాదులు మాత్రం 2006 లో జింబాబ్వేలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు. మాంసం కొరత కారణంగా కరివా సరస్సులోని లక్షకు పైగా మొసళ్లకు కూరగాయల్ని అలవాటు చేశారు అక్కడి నిర్వాహకులు, బహుశా బాబియా కూడా అదే రీతిలో శాకాహారిగా మారి ఉంటుందని హేతువాదులు అభిప్రాయపడుతున్నారు.
పురాణ ప్రశస్తి..
ఒకప్పుడు బిల్వమంగళం అనే భక్తుడు విష్ణువు కోసం భీకర తపస్సు చేశాడు. అతని నిష్ఠకు మెచ్చి శ్రీకృష్ణుడు బాలుడి రూపంలో దర్శనమిచ్చాడు. అయితే ఆ పసివాడిపై బిల్వమంగళం ప్రేమను పెంచుకున్నాడే తప్ప.. మారురూపంలో ఉన్న భగవంతుడ్ని గుర్తించలేకపోయాడు. ఒకరోజు బాగా అల్లరి చేసిన ఆ పిల్లాడిపై బిల్వమంగళం కోప్పడ్డాడు. దాంతో అలిగిన శ్రీకృష్ణ భగవానుడు దగ్గర్లోని ఒక గుహలోకి వెళ్లాడు. అప్పుడు అతను దేవుడని గ్రహించిన బిల్వ మంగళం గుహలో వెతికాడు. అలా వెతుక్కుంటూ బయటకు వచ్చేసరికి మహాపద్మనాభ స్వామి విగ్రహం కనిపించింది. అప్పటి నుంచి గుహకు రెండు వైపులా ఉన్న ప్రాంతాలకు అనంతపురం(ఒకవైపు తిరువనంతపురం, మరోవైపు అనంతపురం) అనే పేరు వచ్చింది.
