టొమాటో కొనలేకపోతున్నారా?

టొమాటో కొనలేకపోతున్నారా?

టొమాటో అంటేనే  ‘వామ్మో’ అనేలా ఉంది పరిస్థితి. అంతకు ముందైతే టొమాటో లేని వంటిల్లే ఉండేది కాదు . ఇప్పుడు దాని ధర పెరిగి కూరల్లో టొమాటో మాయమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టొమాటోకు బదులుగా కొన్ని వెజిటబుల్స్​ ఉన్నాయి.

రెడ్ క్యాప్సికమ్స్: రెడ్​ క్యాప్సికమ్స్..​ టొమాటో కు మంచి ఆల్టర్నేటివ్​ వెజిటబుల్​. దీన్ని కూరల్లో వాడటం వల్ల రుచి, రంగు వస్తాయి. రెడ్​ క్యాప్సికమ్స్​ కూడా టొమాటోల లాంటివే ( నైట్​ షేడ్​ వెజిటబుల్​) కాబట్టి మరీ ఎక్కువ వాడొద్దు. ఈ క్యాప్సికమ్స్​లో విటమిన్​–సి ఎక్కువ ఉంటుంది. అలాగే మెటబాలిజం రేట్​ను కూడా పెంచుతుంది. సో! దీని ద్వారా టొమాటో లేదనే ఫీలింగ్​ను కొంత వరకు తగ్గించుకోవచ్చు. 

సొరకాయ: ఎవరి పెరట్లోనైనా పండే వెజిటబుల్స్​లో సొరకాయ ఒకటి. సొరకాయ ఉందంటే దానికి తోడు టొమాటో ఉండాల్సిందే అంటారు చాలామంది. కానీ టొమాటో లేకుండానే వండాలంటే ఉసిరి, చింతపండు కాంబినేషన్​లో కూర వండితే టొమాటో మచ్చుకైనా గుర్తురాదు. దీంతోపాటు సొరకాయ పప్పులో చింతపండు మిక్స్​ చేసి, 
వేడి అన్నంలో మ్యాంగో పికిల్​ వేసుకొని తింటే.. టొమాటో టేస్ట్​ మీదికి మనసెందుకు మళ్లుతుంది.

చింతపండు: చింత లేని ఇల్లు, చింతపండు లేని వంటిల్లు ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే చింతపండును కూరల్లో వేయడానికి అంతగా ఇబ్బందేమీ ఉండదు. ఈ చింత పండును మోతాదుగా వాడటం వల్ల టొమాటో రుచిలాగే పులుపు, తీపి.. కూరల్లో యాడ్​ అవుతుంది. వేడి వేడి అన్నం, అప్పుడే వండిన కూరలో ఉండే  చింతపండు రుచి నాలుకకు తగిలితే టొమాటో లేదనే చింత ఉంటుందా!

ఉసిరి:  ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. ఇప్పుడు ఆ ఉల్లితో పాటే ఉసిరి కూడా మేలు చేస్తానంటోంది. ఆకుపచ్చ రంగులో ఉండే వీటిని ఇండియన్​ గ్రీన్​ టొమాటోస్​ అని కూడా పిలుస్తారు. పేరులోనే టొమాటో ఉన్న తర్వాత తినడానికి ఆలోచన ఎందుకు? టొమాటోతో కూరకు అందే రుచిని ఏమాత్రం తగ్గించకుండా అందిస్తుంది ఉసిరి. కూరకు ఒగరును, పులుపునే కాదు..  తిన్నవాళ్లకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఉసిరిలో విటమిన్​–సి  ఉంటుంది. ఇది లివర్​ హెల్త్​ను కాపాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్​ను, హార్ట్​ హెల్త్​ను, జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది.

పెరుగు: ఆదివారం వస్తే చాలు ముక్కలేనిదే ముద్ద దిగదు అంటారు చాలామంది. కానీ ఆ ముక్క తిన్న తర్వాత పెరుగు లేకపోతే అసలు తిన్న ఫీలింగే ఉండదు. అలాంటి పెరుగును ఈ టైంలో యూజ్​ చేసుకోవాలి. ఏ కర్రీ వండినా కూడా దాన్ని పెరుగుతో మారినేట్​ చేయొచ్చు. ఇది నాన్​వెజ్​కు అయినా, వెజ్​కు అయినా రుచిని, చిక్కదనాన్ని ఇస్తుంది. కూరలో పులుపును పెంచి టొమాటో లేదనే ఫీలింగ్​ను మరిపిస్తుంది. వీటితో పాటు పచ్చి మామిడి కాయలు కూడా వాడొచ్చు. కానీ ఈ సీజన్​లో దొరకదు కాబట్టి ఆమ్​చూర్​ కూరల్లో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.