'బిర్యానీ మ్యాగీ' కాంబో.. 4వేలకు పైగా వ్యూస్.. వీడియో వైరల్

 'బిర్యానీ మ్యాగీ' కాంబో.. 4వేలకు పైగా వ్యూస్.. వీడియో వైరల్

ఇటీవలి కాలంలో పాత వంటకాలకు మరింత రుచిని తెచ్చేందుకు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అందులో చాక్లెట్లు, పండ్లు, పానీ పూరీలు, ఐస్ క్రీం లాంటివి జోడించి వంటకాలకు కొందరు రుచిని తీసుకువస్తుంటే.. మరి కొందరు మాత్రం వంటకానికి నామరూపాల్లేకుండా చేస్తున్నారు. అదే తరహాలో కొన్ని విచిత్రమైన మ్యాగీ కాంబినేషన్‌లు ఇంటర్నెట్ లో వైరల్ కాగా.. ఇప్పుడు ఓ యూజర్ బిర్యానీ మ్యాగీతో ముందుకు వచ్చారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇటీవల ఓ వీడియోను పంచుకున్నారు. ఇది బిర్యానీ రెసిపీని ఉపయోగించి మనకు ఇష్టమైన మ్యాగీని తయారు చేస్తున్నట్లు చూపిస్తుంది.

వీడియో ప్లే అవుతుండగా, బిర్యానీలో ఉపయోగించినట్లే యూజర్.. తరిగిన ఉల్లిపాయలను నూనెలో వేయించడం చూడవచ్చు. ఆ తరువాత, ఆ వ్యక్తి బీన్స్, క్యారెట్, మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఆకులతో సహా కూరగాయలను కట్ చేసి.. వాటికి ఎర్ర కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఇతర మసాలా దినుసులను కలిపి పాన్‌లోని అన్ని కూరగాయలతో వేగించడం చూడవచ్చు. చివర్లో అతను పాన్ లోప మ్యాగీ, టాపింగ్‌గా కొన్ని బిర్యానీ మసాలాను వేశారు. అది ఉడికిన తర్వాత, రుచిగల బిర్యానీ మాగీని కొత్తిమీర ఆకులతో ప్లేట్‌లో వడ్డించాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..  ఇది అంతగా ఆకట్టుకోలేదని కొందరు, 60 నిమిషాల్లో మ్యాగీ అని కొందరు, 2 నిమిషాల్లో మ్యాగీని తయారు చేయడం సాధ్యం కాదని మరికొందరు కామెంట్ చేశారు. ఈ క్లిప్ కు ఇప్పటివరకు 4మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.