గుండె జబ్బులున్నవారికి దివ్యౌషధం.. ట్రైకాప్రిన్

గుండె జబ్బులున్నవారికి దివ్యౌషధం.. ట్రైకాప్రిన్

జీవనశైలి మారడంతో ఈ మధ్య కాలంలో గుండె జబ్బుల సమస్యలు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే చాలా మంది గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారు. అలాంటి వారికి డైటరీ సప్లిమెంట్ ట్రైకాప్రిన్ దివ్య ఔషధమని ఒసాకా యూనివర్సిటీ రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ సప్లిమెంట్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో సమర్థవంతంగా పని చేస్తుందని అంటున్నారు. నిత్యం ట్రైకాప్రిన్ తీసుకోవడం వల్ల కరోనరీ ఆర్టరీ ప్లాక్ రిగ్రెషన్, ట్రైగ్లిజరైడ్ డిపాజిట్ కార్డియోమయోవాస్కులోపతి లక్షణాలను తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 

కరోనరీ ఆర్టరీ డిసీజ్ కారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు కుచించుకుపోతాయి. అది కాస్తా హార్ట్ఎటాక్ దారి తీస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులు, క్రమంగా ఔషధాన్ని విడుదల చేసే స్టంట్లను ఉపయోగిస్తున్నప్పటికీ కొందరి శరీరం వాటికి అలవాటు పడటంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.

దాదాపు 15ఏళ్ల క్రితం ఒసాకా యూనివర్సిటీ సైటిస్టులు ట్రైగ్లిజరైజ్ డిపాజిట్ కార్డియోమయోవాస్కులోపతి.. (TGCV) అనే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ను గుర్తించారు. ఇందులో గుండె ధమనుల్లో ట్రైగ్లిజరైడ్ డిపాజిట్లు పేరుకుపోతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా డయాబెటిస్,హెమోడయాలసిస్ పేషెంట్లలో టీజీసీవీని గుర్తించినట్లు సైంటిస్టులు చెప్పారు. లక్షణాలను ముందుగానే కనుగొనే అవకాశమున్నప్పటికీ దీనికి సమర్థవంతమైన ట్రీట్ మెంట్ లేకపోవడం దురదృష్టకరం. అయితే టీజీసీవీతో బాధపడుతున్న ఇద్దరు రోగుల్లో కరోనరీ అథెరోస్క్లెరోసిస్  లక్షణాలు తగ్గిన విషయం గుర్తించినట్లు అధ్యయనానికి నేతృత్వం వహించిన కెనిచి హిరానో చెప్పారు. ఛాతీలో నొప్పి, డయాబెటిస్, టీజీసీవీతో బాధపడుతున్న ఆ ఇద్దరికీ ట్రైకాప్రిన్ ఇవ్వగా మెరుగైన ఫలితం కనిపించినట్లు చెప్పారు. 

ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నా ట్రైకాప్రిన్ గుండె కండరాల్లోని లిపిడ్స్ ను తగ్గిస్తాయి. పేషెంట్ కు నొప్పిని తగ్గించడంతో రక్త నాళాల్లో ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా నిరోధిస్తోంది. కరోనరీ డిసీజ్తో బాధపడుతున్న రోగులందరిలో ప్రస్తుతం అందిస్తున్న ట్రీట్మెంట్ సరైన ఫలితం చూపనందున చాలా మంది పేషెంట్లకు డైటరీ సప్లిమెంట్ ట్రైకాప్రిన్ ఓ ఆశాకిరణంలా మారిందని రీసెర్చర్లు అంటున్నారు. అయితే డైటరీ సప్లిమెంట్లు తీసుకునే ముందు డాక్టర్ ను తప్పక సంప్రదించి వారి సూచన మేరకే వాటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.