వయనాడ్‌‌లో రాహుల్.. పక్కవడ రుచి చూడడం మర్వొద్దు

వయనాడ్‌‌లో రాహుల్.. పక్కవడ రుచి చూడడం మర్వొద్దు


కాంగ్రెస్ కీలక నేతల రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గమైన వయనాడ్ లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇక్కడకు వచ్చిన ఆయన శనివారం కూడా ఇక్కడే గడిపారు. ఈ సందర్భంగా వయనాడ్ పరిధిలోని Koliyadi లోని ఎస్ఎస్ కూల్ హౌజ్ లో ఉన్న హోటల్ కు వెళ్లారు. ఈ హోటల్ ను Firos NM‘s family నిర్వహిస్తోంది. అక్కడ వారందిస్తున్న పక్కవడ (Pakkavada)ను రుచి చూశారు. స్థానికంగా ఉన్న నేతలు కూడా రాహుల్ తో ఉన్నారు. వయనాడ్ లోకల్ ఫ్లేవర్ తో చేసిన చట్నీతో తిన్నారు. Kutam Kulukki Sarbath ను కూడా టేస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను రాహుల్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

వయనాడ్ వస్తే.. వీటిని రుచి చూడడం మర్వొద్దని రాహుల్ రాసుకొచ్చారు. ఇక ఓ మీటింగ్ లో రాహుల్ గాంధీ సీపీఎంపై విమర్శలు గుప్పించారు. కేరళ సీఎంపై కేంద్రం సీబీఐ, ఈడీని ఉపయోగించదని, సీపీఎం, బీజేపీ మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. తనను పది రోజులు కాకుండా కేవలం ఐదు రోజులు విచారించడంపై తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. రాజ్యాంగాన్నిBJP, RSS కబ్జా చేస్తున్నాయని, ప్రజల గొంతు నొక్కుతున్నాయని విమర్శించారు. దేశ ఆర్థిక వెన్నెముకపై దాడి చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.