Ram Charan Remuneration: రెమ్యునరేషన్లో ప్రభాస్ను బీట్ చేసిన రామ్ చరణ్.. ఎన్ని కొట్లో తెలుసా?

Ram Charan Remuneration: రెమ్యునరేషన్లో ప్రభాస్ను బీట్ చేసిన రామ్ చరణ్.. ఎన్ని కొట్లో తెలుసా?

ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ సక్సెస్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. సీతారామరాజు పాత్రలో కేవలం ఇండియన్ ఆడియన్స్ ను మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ ను కూడా తనవైపుకు తిప్పుకున్నాడు రామ్ చరణ్. అందుకే ఆయన తరువాతి సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ మెగా హీరో. 

అందులో భాగంగానే ఇటీవల ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనతో ఓ సినిమాను ఒకే చేశాడు చరణ్. భారీ బడ్జెట్ తో, భారీ స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. రూరల్ బ్యాక్డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా వస్తున్న ఈ సినిమాలో వినూత్న పాత్రలో కనిపిస్తాడట చరణ్. ఈ విషయం తెలిసినప్పటినుండి సినిమాపై అంచనాలు రొజురొజుకి [ఎరుగిపోతున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా RC 16 గురించి అలాంటి న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

భారీ బడ్జెట్ తో వస్తున్న RC 16 మూవీ కోసం రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట రామ్ చరణ్. ఈ విషయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను సైతం క్రాస్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గాను ఏకంగా రూ.130 కోట్ల భారీ మొత్తాన్ని తీసుకుంటున్నాడట రామ్ చరణ్. అయితే.. ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇప్పటివరకు ఏ స్టార్ హీరో తీసుకోలేదని టాక్. లాభాల్లో వాటాల రూపంలో ఇంతకంటే చాలా ఎక్కువే తీసుకున్న హీరోలు ఉన్నారు కానీ, కేవలం ఇలా పారితోషకంగానే రూ.130 కోట్లు తీసుకున్న హీరో రామ్ చరణ్ మాత్రమే నట. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.