దంచికొడుతున్న ఎండలు .. కేరళలో ముగ్గురు ఓటర్లు మృతి

దంచికొడుతున్న ఎండలు .. కేరళలో ముగ్గురు ఓటర్లు మృతి

దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.  దీంతో లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వస్తున్న ఓటర్లు  ఆప‌సోపాలు ప‌డుతూ పోలింగ్ బూత్‌ల‌కు చేరుకుంటున్నారు. కేరళలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎండ వేడి త‌ట్టుకోలేక  ముగ్గురు ఓటర్లు కన్నుమూశారు.  పాలక్కాడ్‌, మ‌ల‌ప్పురం, అల‌ప్పుజా నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరు చనిపోయారు.  కోజికోడ్‌లో ఓ పోలింగ్ ఏజెంట్ అనీస్ అహమ్మద్ (66) మృతిచెందాడు. 

మృతులను పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన  చంద్రన్ (68),  అలప్పుజా లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వృద్ధ ఓటరు  సోమరాజన్ (70),  మలప్పురం జిల్లా తిరూర్‌కు చెందిన మదర్సా ఉపాధ్యాయుడు సిద్ధిక్ (63) గా గుర్తించారు.   కేరళలో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.  మధ్యాహ్నం 2 గంటల వరకు 44.86% పోలింగ్ నమోదైంది.  

ఎర్నాకుళం నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా ఓటరు తన పేరు మీద నకిలీ ఓటు వేయబడిందని ఆరోపించింది.  బూత్ నంబర్ 132లో ఉదయం 10.30 గంటల లోపు తన పేరు మీద బోగస్ ఓటు పడిందని చెప్పింది.  ఎలంకున్నపుజాలోని కట్టస్సేరి హౌస్‌కు చెందిన థంకమ్మ. తిరువనంతపురంలోని పోతేన్‌కోడ్ మేరీ మాతా స్కూల్‌లోని బూత్ 43కి రావడానికి గంట ముందు తన ఓటు నమోదు అయిందని 66 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది.