
డెబ్యూ డైరెక్టర్ భరత్ మిత్ర (Bharath Mithra) తెరకెక్కించిన మూవీ ఏం చేస్తున్నావ్ (Em Chesthunnav?).విజయ్ రాజ్ కుమార్ (Vijay Rajkumar) హీరోగా, నేహా పటాన్ (Neha Pathani),అమిత రంగనాథ్(Amitha Ranganath) హీరోయిన్స్గా నటించిన ఈ మూవీ గతేడాది ఆగస్టు 25న థియేటర్లలో రిలీజై యావరేజ్ మౌత్ టాక్ తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో రిలీజ్ అయింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది.
అయితే, ఈటీవీ విన్ ఓ టీటీలో 90's మిడిల్‌క్లాస్ వెబ్‌సిరీస్, రితికా సింగ్ వళరి తర్వాత హయ్యెస్ట్ వ్యూస్ ఏం చేస్తున్నావ్ మూవీ దక్కించుకున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. మరి థియేటర్లో హిట్ అవ్వని..ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఓటీటీలో ఆడియన్స్ మనసు గెలుచుకోవడం పట్ల మేకర్స్ ఖుషి అవుతున్నారు.
నవీన్ కురువ, కిరణ్ కురువ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో నటించింది ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు కావడం..అలాగే పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో థియేటర్లో వచ్చి పోయిన ఫీలింగ్ అయితే వచ్చింది.
ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఆమని,C/o కంచరపాలెం రాజు.మధు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీని ఎన్‌విఆర్ (NVR) క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కురువ నవీన్ (Kuruva Naveen) కురువ కిరణ్(Kuruva kiran) ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథ విషయానికి వస్తే..
బీటెక్ కంప్లీట్ చేశాక ఉద్యోగం కోసం చూస్తున్న యువకులు అందరూ రిలేట్ అయ్యేలా కథను రాసుకున్నాడు డైరెక్టర్. చదువు పూర్తిచేసుకొని తల్లిదండ్రుల చెప్పినట్లుగా ఉద్యోగం చేయాలా? లేదంటే తన గోల్‌వైపు అడుగులు వేయాలో తెలియని కన్ఫ్యూజన్‌లో ఉన్న ఓ యువకుడి కథతో ఏం చేస్తున్నావ్ మూవీ తెరకెక్కింది. అతడి జీవితంలోకి ఓ అమ్మాయి ఎలా వచ్చిందన్నది నాచరల్ కామెడీతో ఏం చేస్తున్నావ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది.