జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం... లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు స్పాట్ డెడ్..

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం... లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు స్పాట్ డెడ్..

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ( జూన్ 12 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లాలో జనగామ నుండి సూర్యాపేట ప్రధాన రహదారిపై కారు లారీని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..  మరోముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

లింగాల ఘనపూర్ మండలం నుండి నవాబుపేట గ్రామం దగ్గర జరిగింది ఈ ఘటన. ఘటన జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులు కాజీపేటకు చెందిన ఎండీ మసీద్, అతని డ్రైవర్ సుభాన్ గా గుర్తించారు పోలీసులు. వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.