ముగ్గురికి డిప్యూటీ జైలర్స్ గా ప్రమోషన్స్

ముగ్గురికి డిప్యూటీ జైలర్స్ గా ప్రమోషన్స్

హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ జైలర్స్ కు డిప్యూటీ జైలర్స్ గా పదోన్నతి కల్పిస్తూ  రాష్ట్ర జైళ్ల శాఖ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఐజీ డి. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కేటాయించారు.హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలులో అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి. రాజేంద్రబాబును సంగారెడ్డి సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలుకు, ఎం. సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని కల్వకుర్తి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలుకు బదిలీ చేస్తూ.. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా జైలుకు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

చర్లపల్లి సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలు అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వై. వెంకటరెడ్డిని మిర్యాలగూడ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలుకు పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తూ నల్లగొండ జిల్లా జైలుకు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. వెంటనే సంబంధిత యూనిట్ల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డీఐజీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వుల్లో సూచించారు.