సమ్మర్ స్పెషల్ ..చుక్క నూనె, గ్యాస్ లేకుండా..ఈజీగా హెల్దీ రెసిపీలు ట్రై చెయ్యండి

సమ్మర్ స్పెషల్ ..చుక్క నూనె, గ్యాస్ లేకుండా..ఈజీగా హెల్దీ రెసిపీలు ట్రై చెయ్యండి

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో వంటింట్లో చెమటోడ్చి వేడి వేడి వంటలు చేయాలంటే కచ్చితంగా అలసట వస్తుంది. ఒక్క రోజైనా లేదా ఒక్క పూటైనా వంటింటి వేడి నుంచి తప్పించుకునే చాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటప్పుడు చుక్కనూనె లేకుండా, గ్యాస్​ లేకుండా ఈజీగా, హెల్దీగా చేసుకోవాలంటే ఈ రెసీపీలు ఫాలో అవ్వాలి. మరి ఇంకేం.. చకచకా చదివేసి వెంటనే షురూ చేయండి. 

దహీ​ పోహా

కావాల్సినవి :
అటుకులు (పోహా), కీరా తరుగు, పెరుగు - ఒక్కో కప్పు
ఫూల్ మఖానా, క్యారెట్ తరుగు - ఒక్కోటి అర కప్పు
జీలకర్ర పొడి, అవిసె గింజల పొడి -ఒక్కో టీస్పూన్
కొత్తిమీర, కరివేపాకు - కొంచెం
ఉప్పు - సరిపడా

తయారీ :
అటుకులను తడిపి పక్కన ఉంచాలి. పాన్​లో ఫూల్ మఖానా వేసి వేగించాలి. ఒక గిన్నెలో అటుకులు, పెరుగు, కీరా తరుగు వేసి కలపాలి. తర్వాత అందులో వేగించిన ఫూల్ మఖానా, క్యారెట్ తరుగు, జీలకర్ర పొడి, అవిసె గింజల పొడి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. కావాలంటే నేతిలో వేగించిన జీడిపప్పు తరుగు చల్లుకుంటే సరి.

మట్కీ మోదక్

కావాల్సినవి :
శనగపప్పు - ఒక కప్పు
చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు
యాలకులు - రెండు, నెయ్యి, 
మలై - ఒక్కోటీ రెండు టీస్పూన్లు, పాలు - మూడు టేబుల్ స్పూన్లు

తయారీ :
మిక్సీ జార్​లో వేగించిన శనగపప్పు వేసి పొడిగా చేయాలి. తర్వాత ఆ పొడిని జల్లెడ పట్టాలి. చక్కెర, యాలకులను గ్రైండ్ చేసి ఆ పొడిని కూడా గిన్నెలో వేసి కలపాలి. అందులో నెయ్యి, మలై వేసి పాలు పోసి ముద్దగా చేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి మోదక్​ రూపంలో తయారుచేసుకోవాలి. 


కొబ్బరిపాల ఇడ్లీ

కావాల్సినవి :
కొబ్బరి పాలు - రెండు కప్పులు
పోహా - ఒక కప్పు
మరమరాలు - అర కప్పు
ఉప్పు - సరిపడా
క్యారెట్, కొత్తిమీర తురుము - కొంచెం

 తయారీ : మిక్సీ జార్​లో పోహా, మరమరాలు వేసి పొడిలా చేయాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసి అందులో కొబ్బరి పాలు పోయాలి. అవన్నీ మిక్స్​ అయ్యేలా బాగా కలపాలి. అందులో ఉప్పు, క్యారెట్, కొత్తిమీర తురుము వేయాలి. మరోసారి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత ఇడ్లీపాత్రలో పెట్టాలి. కాసేపయ్యాక చూస్తే ఇడ్లీ తినడానికి రెడీ అవుతుంది.