తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో..

తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్  హీరో..

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తండ్రి కాబోతున్నాడు. తన భార్య బేబీ బంప్  ఫోటోలను షేర్ చేసిన నవీన్ చంద్ర..‘తండ్రి కాబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నిన్ను నా చేతుల్లోకి ఎప్పుడెప్పుడు తీసుకుని ముద్దాడేందుకు ఎదురుచూస్తున్న. కొత్త దశ, కొత్త జీవితం, కొత్త ప్రయాణం, తండ్రిని కాబోతున్నా..ఒర్మా(తన బిడ్డ) ఐలవ్ యూ 2023కు  స్వాగతం ’ అని పోస్ట్ చేశాడు. దీంతో  నవీన్ చంద్ర దంపతులకు సోషల్ మీడియా వేదికగా పలువురు  విషెస్ చెబుతున్నారు. 

 అందాల రాక్షసితో హీరోగా  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర హీరోగా,విలన్ గా  నటిస్తున్నాడు. అరవింద సమేత, నేను లోకల్, వీరసింహారెడ్డి వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. అలాగే  వెబ్ సిరీస్ లు  అమ్ములో భార్యను వేధించే భర్తగా నటించాడు.