గచ్చిబౌలి, వెలుగు: మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న స్వాతంత్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. దీంతో సోమవారం ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
వెహికల్స్ డైవర్షన్ ఇలా..
- నీరూస్ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లే వెహికల్స్‌ను మాదాపూర్ సీవోడీ జంక్షన్ నుంచి దుర్గం చెరువు, ఇనార్బిట్ మాల్, ఐకియా సెంటర్, బయోడైవ
- ర్సిటీ జంక్షన్ మీదుగా దారి మళ్లించనున్నారు.
- గచ్చిబౌలి నుండి నీరూస్ జంక్షన్ వైపు వచ్చే వెహికల్స్ కూడా ఇదే రూట్లో రావాల్సి ఉంటుంది.
- మియాపూర్, హఫీజ్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కొత్తగూడ, ఏఐజీ హాస్పిటల్, ఐకియా సెంటర్, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- ఆర్సీపురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వెపు వెళ్లే వెహికల్స్‌ను బీహెచ్ఈఎల్,నల్లగండ్ల, హెచ్ సీయూ, ఐఐఐటీ జంక్షన్ మీదుగా దారి మళ్లించనున్నారు.
ఈ రూట్లలో భారీ వెహికల్స్‌కు నో ఎంట్రీ
జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్ రోడ్, మియాపూర్ నుంచి కొత్తగూడ, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి సైబర్ టవర్స్ రోడ్, నారాయ
ణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి వెళ్లే రూట్లలో భారీ వెహికల్స్‌కు అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

