'టాప్ తెలుగు ఇన్ ఫ్లూయెన్సర్ ' పేరుతో ఆహా ఓటీటీ సరికొత్త షోనుప్రేక్షకులముందుకు తీసుకొస్తోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రష్మిజ్యూరీగా వ్యవహరిస్తున్న ఈ షో జులై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యూరీ మెంబర్ మంచు లక్ష్మి మాట్లాడుతూ 'షోలో కోర్ టీమ్ అంతా మహిళలే ఉండటం గర్వంగా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని చేస్తున్నారు.
ఔట్పుట్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. మన తెలుగు ఇన్ఫ్లూయెన్సర్కు మరింత గుర్తింపు ఇచ్చే వేదికగా ఈ షో అవుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. మరో జ్యూరీ మెంబర్ రష్మి మాట్లాడుతూ 'కొవిడ్ పాండమిక్ తర్వాత సోషల్ మీడియాలో చాలా మార్పులొచ్చాయి. ఇన్ఫ్లూయెన్సర్ల ఇంపాక్ట్ చాలా పెరిగింది. అందుకే వాళ్లతో ఓ యూనిక్ షోను ఆహా ప్లాన్చేసింది.
ఈ షోను మరింతగా ఆడియెనక్కు రీచ్చేసేందుకు ప్రయత్నిస్తా' అని చెప్పింది. తెలుగులో ఇలాంటి షో ఇప్పటి వరకు రాలేదని ఆహా కంటెంట్ హెడ్ కవిత చెప్పారు.
