ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ సాగే వసుదేవసుతం మూవీ...

ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ సాగే వసుదేవసుతం మూవీ...

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా వైకుంఠ్ బోను దర్శకత్వంలో త్రినాథ్కేశవ, ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన చిత్రం 'వసుదేవసుతం'. జులై 10న సినిమా విడుదల కానుంది. మంగళవారం ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఒరిస్సా లోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథ ఉంటుందని రివీల్ చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో మహేంద్రన్ మాట్లాడుతూ 'ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. మణిశర్మ గారి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది' అని అన్నాడు. 

ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని అంబికా వాణి చెప్పింది. దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ 'ఒరిస్సాలోని వాసుదేవుని టెంపుల్ బ్యాక్ డ్రాప్లో రాసిన ఈ కథ నిర్మాతలతోపాటు మహేంద్రన్కు బాగా నచ్చింది. ఇందులోని డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. చివరి 45 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది' అని చెప్పాడు. ఈ చిత్రం ఎవర్నీ నిరాశపర చదు అని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.