ప్రచారానికే  ‘మన ఊరు - మన బడి’ పరిమితం

ప్రచారానికే  ‘మన ఊరు - మన బడి’ పరిమితం

హైదరాబాద్: రాష్ట్ర పేద పిల్లల చదువులకు ‘చంద్ర గ్రహణం’ పట్టిందని టీపీసీసీ ప్రెసిడెంట్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రేవంత్  ట్వీట్ చేశారు. పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా... ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని ఫైర్ అయ్యారు. కేసీఆర్ విద్యా వ్యవస్థను నాశనం చేసిండని ఆరోపించారు. ‘మన ఊరు - మన బడి’ ఓ ప్రచార ఆర్భాటమన్న ఆయన... ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.