దేశ సమైక్యత కోసమే రాహుల్ భారత్ జోడో యాత్ర

దేశ సమైక్యత కోసమే రాహుల్ భారత్ జోడో యాత్ర

బీజేపీ దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. దేశ సమైక్యత కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొని.. బీజేపీ మత రాజకీయాలను తిప్పికొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు.

మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. బై ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ ఇతర నేతలు హాజరయ్యారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ నెల 9 నుంచి 14 వరకు రేవంత్ సహా ఇంచార్జ్ లంతా అక్కడే మకాం వేయాలని నిర్ణయించారు. 

ఈ నెల 11న కాంగ్రెస్ మునుగోడు అభ్యర్ధి పాల్వాయి శ్రవంతి నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత 14న భారీ జనసమీకరణతో మరోసాని నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ హయాంలోనే మునుగోడు అభివృద్ధి జరిగిందని పాల్వాయి స్రవంతి అన్నారు. అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్సే గెలుస్తుందన్నారు.

బీఆర్ఎస్ మొదలైతే తెలంగాణలో టీఆర్ఎస్ కు వాలంటరీ రిటైర్మెంటేనని కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, బెల్లయ్య నాయక్ లు వ్యాఖ్యానించారు. కుమారుడు, కుమార్తె, అల్లుడుకు రాజ్య విస్తరణ కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ పెడ్తున్నారని విమర్శించారు. తెలంగాణలో విఫలమైన కేసీఆర్.. నేషనల్ పార్టీ పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కొడుకును సీఎంను చేయడానికి కేసీఆర్ బీఆర్ఎస్ పెడ్తున్నారని మధుయాష్కీ, బెల్లయ్యనాయక్ ఆరోపించారు. రాష్ట్రంలో జరగనున్న రాహుల్ యాత్రను విజయవంతం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. బీజేపీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.