యాదాద్రి టెంపుల్ చుట్టూ రథంతో ట్రయల్

యాదాద్రి టెంపుల్ చుట్టూ రథంతో ట్రయల్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి మెయిన్​ టెంపుల్​చుట్టూ ఆదివారం స్వామివారి దివ్య విమాన రథాన్ని తిప్పారు. టెంపుల్ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో.. పాక్షికంగా ధ్వంసమైన దివ్యవిమాన రథానికి రిపేర్లు చేసి, ఎత్తు పెంచారు. ఎంత దూరం నుంచి చూసినా రథంలోని లక్ష్మీనరసింహులు భక్తులకు స్పష్టంగా కనిపించేలా కొన్ని మార్పులు చేశారు.  అందంగా ముస్తాబు చేసి మెయిన్ టెంపుల్ చుట్టూ ట్రయల్ నిర్వహించారు. 
ఆదివారం రూ. 12 లక్షల ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి హైదరాబాద్ లోని విద్యానగర్ కు చెందిన లక్ష్మణ్, జయంతి దంపతులు ఆదివారం బంగారు హారాన్ని బహూకరించారు. 28 గ్రాముల బంగారంతో చేయించిన లక్ష్మీహారానికి దాతలు ప్రత్యేక పూజలు నిర్వహించి, టెంపుల్ సూపరింటెండెంట్ వాసం వెంకటేశ్​ చేతుల మీదుగా ఆలయానికి సమర్పించారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.12,31,849 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.5,28,315 ఇన్ కం సమకూరినట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు.