చర్లపల్లి జైలు  డిప్యూటీ సూపరింటెండెంట్ బదిలీ

చర్లపల్లి జైలు  డిప్యూటీ సూపరింటెండెంట్ బదిలీ

కుషాయిగూడ, వెలుగు : ములాఖాత్​కి వచ్చే ఖైదీల భార్యల్ని వేధిస్తున్న చర్లపల్లి జైల్ డిప్యూటీ సూపరిటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు పడింది. జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న సయ్యద్​ బాషాతో పాటు ములాఖాత్​కు వచ్చే మహిళల ఫిర్యాదు మేరకు జైళ్ల శాఖ డీజీ జితేందర్ ఈ చర్యలు తీసుకున్నారు. తన భార్య ములాఖాత్​కు వచ్చినప్పుడల్లా దశరథం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని సయ్యద్​ బాషా, సోమవారం జైలు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశాడు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు డీజీ జితేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దశరథంను ఓపెన్​ ఎయిర్​ జైల్​కు ట్రాన్స్​ఫర్​ చేస్తూ మంగళవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దశరథంకు సంబంధించిన న్యూడ్​ వీడియోలు కూడా ఇటీవల బయటికొచ్చాయి. ఖైదీల ప్రవర్తనలో మార్పులు తీసుకురావాల్సిన దశరథం, ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటంతో డీజీ సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.