సీరియల్ ఆర్టిస్టునని నమ్మించి యువతిని ట్రాప్‌

సీరియల్ ఆర్టిస్టునని నమ్మించి యువతిని ట్రాప్‌

24లక్షలు కొట్టేసి మోసం చేసిన యువకులు

గూగుల్‌పే అకౌంట్లకు మనీ ట్రాన్స్‌‌ఫర్‌

నిందితుడితో పాటు ఫ్రెండ్​ అరెస్ట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  యువతిని ట్రాప్‌‌ చేసి రూ.24 లక్షలు కొట్టేసిన ఇద్దరు యువకులను రాచకొండ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. నిందితుల వద్ద రూ.4 లక్షల విలువైన గోల్డ్‌‌, బైక్‌‌ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సైబర్‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌ ఏసీపీ తెలిపిన ప్రకారం.. కొండాపూర్‌‌‌‌కి చెందిన వీరబత్తిని నరేశ్‌‌కుమార్‌‌‌‌(29) ఫిల్మ్‌‌నగర్‌‌‌‌లోని ఫిల్మ్‌‌ ఛాంబర్స్‌లో ఆఫీస్‌‌ బాయ్‌‌గా పనిచేశాడు. మోసాలకు పాల్పడడంతో కొంతకాలం కిందట జాబ్‌‌లోంచి తీసేశారు. ఆ తర్వాత  జిల్లెలగూడకు చెందిన విమెన్‌‌ మేకప్‌‌ ఆర్టిస్ట్‌ను జస్ట్‌‌ డయల్‌‌ ద్వారా ట్రాప్‌‌ చేశాడు.  ఫ్రెండ్‌‌ షిప్‌‌ చేసి పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. ఆమె సోదరుడికి జాబ్‌‌ ఇప్పిస్తామని, తన ఫ్రెండ్‌‌ అకునూరి గిరిబాబు(25)తో కలిసి ఫిబ్రవరి నుంచి జూన్‌‌ వరకు రూ.24 లక్షలు తీసుకున్నాడు.  ఆడబ్బుతో   బంగారం,  బైక్స్‌‌ కొనడమే కాకుండా వైజాగ్‌‌, తిరుపతి, బెంగళూర్‌‌‌‌లోని లగ్జరీ హోటల్స్‌ లో గడిపారు. బాధితురాలి కంప్లయింట్‌‌తో సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి  నిందితులను  అరెస్ట్ చేసి రిమాండ్‌‌కి తరలించారు.