క్వారంటైన్‌లో త్రిపుర సీఎం.. కుటుంబ సభ్యుల్లో ఇద్ద‌రికి క‌రోనా

క్వారంటైన్‌లో త్రిపుర సీఎం.. కుటుంబ సభ్యుల్లో ఇద్ద‌రికి క‌రోనా

దేశంలోని ప‌లువురు ప్ర‌ముఖుల‌పై క‌రోనా పంజా విసురుతోంది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క సీఎం యెడియూర‌ప్ప‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క‌రోనా బారిన ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ కోవిడ్ -19 ప‌రీక్ష‌లు చేయించుకోగా.. అత‌నికి నెగటివ్ అని తేలింది. కానీ అతని కుటుంబ సభ్యుల్లో ఇద్ద‌రికి పాజిటివ్ అని తేల‌డంతో సీఎం.. హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

ఈ విష‌య‌మై సీఎం బిప్ల‌వ్ కుమార్ దేవ్ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. క‌రోనా టెస్ట్ చేయించుకోగా నెగ‌టివ్ అని వ‌చ్చింద‌ని.. ‌ఏదేమైనా, రాబోయే ఏడు రోజులు హోం క్వారంటైన్ లో ఉంటూ.. కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తాన‌ని చెప్పారు. ఈ ఏడు రోజులు ఇంటి నుండి పని చేస్తాన‌ని చెప్పారు. త‌న బాగు కోసం ప్రార్థించిన త్రిపుర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియ‌జేశారు. కోవిడ్ -19 కి వ్యతిరేకంగా త‌మ‌ పోరాటం కొనసాగుతుంద‌ని, త‌ప్ప‌కుండా గెలుస్తామ‌ని మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం దేవ్ తన తల్లి మినా, భార్య నీతి మరియు వారి ఇద్దరు పిల్లలతో అగర్తాలాలోని తన అధికారిక నివాసంలో ఉంటున్నాడు.

Biplab Kumar Deb