ఆయనతో మాట్లాడటంపై కరెక్ట్ టైమ్ లో చెప్తా: ట్రంప్

ఆయనతో మాట్లాడటంపై కరెక్ట్ టైమ్ లో చెప్తా: ట్రంప్

న్యూఢిల్లీ: నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ రీసెంట్ గా పాల్గొన్న ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఆ దేశ మీడియా శనివారం విడుదల చేసింది. దీంతో కిమ్ అనారోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పడింది. కిమ్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి తగిన సమయంలో మేం చెప్తాం అని వైట్ హౌజ్ రిలీజ్ చేసిన ఓ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ వారాంతంలో కొందరు ఫారెన్ లీడర్స్ తో మీటింగ్స్, ఫోన్ కాల్స్ లో మాట్లాడటానికి క్యాంప్ డేవిడ్ కు వెళ్లనున్నట్లు ట్రంప్ వివరించారు.

మూడు వారాలుగా పబ్లిక్ ప్లేస్ ల్లో కనిపించకపోవడంతో కిమ్ జాంగ్ హెల్త్ పై వస్తున్న పుకార్లు, ప్రశ్నలకు తెరవేసేందుకు ఆయన పాల్గొన్న వేడుకకు సంబంధించిన ఫొటోస్ ను కొరియన్ మీడియా విడుదల చేసింది. శుక్రవారం మేడే సందర్భంగా ఉత్తర కొరియాలోని ఒక ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో కిమ్ జాంగ్ పాల్గొన్నారని అక్కడి మీడియా పేర్కొంది.

సరదాగా కనిపించిన కిమ్

కిమ్ పాల్గొన్న ఫెర్టిలైజర్ కంపెనీ నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ కు సమీపంలోని సుంచాన్ లో ఉంది. రోడోంగ్ సిన్మున్ అనే నార్త్ కొరియా న్యూస్ పేపర్ పబ్లిష్ చేసిన ఫొటోల్లో కిమ్ జాంగ్ ప్రభుత్వ సీనియర్ అధికారులతో కలసి నవ్వుతూ కనిపించారు. ఆ ఫొటోల్లో కిమ్ తో పాటు ఆయన సోదరి, సలహాదారు కిమ్ యో జాంగ్ కూడా ఉండటం గమనార్హం