ఏసీబీకి చిక్కిన స్కూల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్

ఏసీబీకి చిక్కిన స్కూల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సోదాలు చేస్తోంది ఏసీబీ. 40 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఓ ఫైల్ క్లియరెన్స్ కి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు శ్రీనివాస్. సైఫాబాద్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం..‘ ఒక ప్రైవేటు స్కూల్ 7వ తరగతి వరకు అనుమతి ఉంది. 8,9,10 తరగతుల అనుమతి కోసం స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు సంప్రదించాడు బాధితుడు. పర్మిషన్ ఇవ్వాలి అంటే 40 వేల రూపాయలు లంచం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేసాడు.. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అనుమతికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి డబ్బులు ఆఫీసుకు తెచ్చి ఇవ్వమని శ్రీనివాస్ చెప్పారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ 40 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాము. శ్రీనివాస్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు సమాచారం అందించండి‘ అని అన్నారు