తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 1365 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుండి ఫిబ్రవరి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
నిన్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ స్టాఫ్ నర్సుల ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక గ్రూప్ 2లో 768 పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి గ్రూప్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

