V6 News

544 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

544 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.