- ఉదయం 8 గంటలకే సెంటర్లలోకి అనుమతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జులై1న జరిగే గ్రూప్ 4 పరీక్షకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం జరిగే ఈ పరీక్షకు 9,51,321 మంది అటెండ్ కానున్నారు. వీరికోసం 2,878 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి వరకూ 8.50లక్షల మంది హాల్ టికెట్లు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారు. కాగా, శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12:30 గంటల వరకు పేపర్1 పరీక్ష జరగనుండగా, ఉదయం 8గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
9.45 గంటలకు సెంటర్ గేట్ క్లోజ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్ 2 ఎగ్జామ్ కు ఒంటిగంట నుంచి సెంటర్లలోకి అభ్యర్థులను అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2.15 తర్వాత ఎవ్వరినీ లోపలికి అనుమతించబోమని వెల్లడించారు. అభ్యర్థులు తప్పకుండా ప్రభుత్వం జారీ చేసిన ఏదైన ఒక ఫొటో ఐడెంటిటీ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, బెల్టు, డిజిటల్ వాచ్ తీసుకురావొద్దని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణకు ప్రతిసెంటర్కు సీఎస్ తో పాటు లైజెనింగ్ ఆఫీసర్‌ను
నియమించారు.
