తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్ 2020 ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల గడువును జులై 10 వరకు పొడిగించింది. ప్రవేశ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని కన్వీనర్ ఎస్. వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదిని 10-07-2020 కి పొడిగించామని చెప్పారు. ఇతర వివరాల కోసం https://tsrjdc.cgg.gov.in/ లో పొందుపరచిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో చూడవచ్చని చెప్పారు.