సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు (జూలై 26న) వెబ్ ఆప్షన్లు

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు (జూలై 26న) వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు: మెడికల్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు (ఎంఆర్‌‌బీ) ద్వారా ఎంపికైన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) వైద్యుల పోస్టింగ్‌‌ల కోసం తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌‌ను ప్రకటించింది. ఇందులో అనెస్తీషియా, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాలకు ఎంపికైన అభ్యర్థులు ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు  జులై 24 అధికారిక పోర్టల్‌‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

అనంతరం జులై 26న పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌‌తో పోర్టల్‌‌లో లాగిన్ అయి ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. మెరిట్‌‌, ఖాళీల ఆధారంగా పోస్టింగ్‌‌లు కేటాయిస్తారు. ఒకసారి నమోదు చేసిన వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉండదు.