మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఖాళీ ప్రదేశంలో చెత్తకు మంటపెట్టడంతో రెండు కార్లు దగ్దమయ్యాయి. గురువారం ( జూన్ 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్ లోని ఓ ఖాళీ ప్రదేశంలో చెత్తకు మంట పెట్టడంతో పక్కనే ఉన్న రెండు కార్లు దగ్దమయ్యాయి.
గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు మంట పెట్టి వెళ్లారని తెలిపారు స్థానికులు. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
చెత్తకు పెట్టిన మంట కారు టైర్లకు తగులుకొని కారు మొత్తం తగలబడిందని అంటున్నాడు యజమాని. కారు కొని ఏడాది కూడా కాలేదని తెలిపాడు యజమాని. ఎండాకాలంలో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందని... వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
