ఆడి కారులో వచ్చి టీ అమ్ముతున్నారు..

ఆడి కారులో వచ్చి  టీ అమ్ముతున్నారు..

1999లో సమరసింహారెడ్డి సినిమా రిలీజైన తరువాత..  సినిమా ప్రభావమో ఏమో తెలియదుకాని.. మొబైల్ దుకాణాలు పెరిగిపోయాయి. కూరగాయల దుకాణాలు  ...  మొబైల్ టిఫెన్ సెంటర్లు..  మరీ ముఖ్యంగా వీధి వ్యాపారులు వాహనాలపై వ్యాపారాలు చేస్తున్నారు. కానీ విచిత్రంగా  ఆడీ కారులో టీ అమ్ముతున్న వాళ్ళను మీరెప్పుడైనా చూశారా? ఇదిగో ఓఇద్దరు  వ్యక్తులు ఆడీ కారులో టీ అమ్ముతూ నెటిజన్లకు ఝులక్ ఇస్తున్నాడు.

బెంజ్ కారులో  బెండకాయలు, బీరకాయల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? ఆడి కారులో వచ్చి ఆనపకాయలు అమ్మితే ఎలా ఉంటుంది? చూసేవారికి కాస్త వింతగా..ఈ రేంజ్ లో ఉండి ఇలాంటి వ్యాపారాలేంటిరా బాబూ అంటు కాస్త ఆసక్తిగా చూస్తారు జనాలు. కానీ చూసేవారు ఏమనుకుంటే మనకేంటీ?..చేతికి అదనపు ఆదాయం వస్తోందా? లేదా? అని అనుకుంటున్నారు కొంతమంది యువత. వినూత్నంగా ఆలోచిస్తు పార్ట్ టైమ్ జాబ్ లాగా కొంతమంది యువత అదనపు ఆదాయం దిశగా ఆలోచిస్తున్నారు. సరిగ్గా అలానే ఆలోచించారు ఓ ఇద్దరు యువకులు.. 

వివరాల్లోకి వెళ్తే..

ముంబైలోని లోఖండ్ వాలా బ్యాక్ రోడ్డులో పక్కనే ఆడి కారు, డిక్కీలో సామాను. దానిపక్కనే వేడి వేడి ఛాయ్ రెడీ చేస్తుండడం కనిపిస్తుంది. ఛాయ్ అమ్మడం అయిపోయిన తర్వాత ఎంచక్కా ఆడి కారులో తిరిగి వెళ్లిపోతారు. అమిత్ కాశ్యప్, మను శర్మ అనే ఇద్దరు యువకులు చేసే ఈ పని ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ‘ఆడి చాయ్ వాలా’పేరొందారు వీరిద్దరు. వీరి స్టాల్ కు ‘రఓడీ టీ’అని పేరు పెట్టుకున్నారు.

MBA చాయ్ వాలా...

ప్రస్తుతం కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు MBA చాయ్ వాలా గురించి వినే ఉంటారు. టీ అమ్ముతూ రూ.4 కోట్ల టర్నోవర్ చేసే 25 ఏళ్ల యువకుడిని ఎంబీఏ చాయ్ వాలా అంటారు. కొద్ది రోజుల క్రితం ఓ యువతి పానీపూరీ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు మరో వీడియో వైరల్‌ అవుతుంది. ఈ వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తిని ఆడి చాయ్‌వాలా అని పిలవవచ్చు. ఈ వీడియోను ఆశిష్ త్రివేది తన ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ లో షేర్ చేశారు. అందులో ఆడి కారులో టీ అమ్ముతున్న వ్యక్తిని మీరు చూడవచ్చు.

ఆడి కారులో టీ వ్యా పారం

సోషల్ మీడియాలో ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్న చాయ్ వాలాకి ఆడి కారు ఉంది. ఆడి  కార్ ఒక లగ్జరీ కార్ కంపెనీ అని మీకు తెలిసిందే. చాలామంది ఆడి  కార్ కొనాలని కలలు కంటారు. లక్షలాది రూపాయలు అప్పు చేసి కూడా ఆడి కార్లను కొంటుంటారు. కష్టపడి సంపాదించిన కారును ఎవరైనా చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. చిన్న గీత తగిలినా నిద్ర పట్టదు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి టీ అమ్మేందుకు ఆడి కారును ఉపయోగిస్తున్నాడు. తామేంటీ తమ రేంజ్ ఏంటీ అని ఆలోచించకుండా టీ,కాఫీలు అమ్మటానికి కూడా వెనుకాడటంలేదు. ముంబైలో ఇద్దరు యువకుల్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఇద్దరు కుర్రాళ్లు దర్జాగా ఆడి కారలో వస్తారు.డిక్కి ఓపెన్ చేసిన దాంట్లో ఉన్న సరంజామా బయటకు తీసి చకచకా వేడి వేడిగా టీ,కాఫీలు అమ్ముతారు. తరువాత చక్కగా ఆడికారు దుకాణం మూసి దర్జాగా అదే ఆడీ కారులో వెళ్లిపోతారు. 

అదనపు ఆదాయం

వీరిద్దరికి డబ్బుల్లేక కాదు. డబ్బులు లేకపోతే ఆడికారు ఎందుకు వేసుకొస్తారు? పార్ట్ టైమ్ ఆదాయం కోసమే వీరు టీ షాప్ ఎంపిక చేసుకున్నారు. వీళ్లను చూసి కొంతమంది ఆశ్చర్యపోతుంటే మరికొంతమంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆడి కారు ఉన్నా ఛాయ్ అమ్మడం ఏంటీ అని కొంతమంది ఆశ్చర్యచూస్తారు. మరికొంతమంది డబ్బున్నోళ్లు గరీబోళ్ల మాదిరిగా ఈ ఛాయ్ అమ్మడం ఏంటీ అని మరికొందరు.

26 లక్షల వ్యూస్.. 72 వేల లైక్ లు

ఈ వీడియోను ఇప్పటివరకు సోషల్ మీడియాలో 26 లక్షల మంది చూశారు. కామెంట్స్‌లో జనాలు అతన్ని ఆడి చాయ్‌వాలా అని కూడా  పిలుస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు 72 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.  కొంత మంది ఈఎంఐ కవర్ చేయడానికి టీ విక్రయిస్తున్నాడని ఒకరు, టీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో మెర్సిడెస్-బెంజ్ జీ వాగన్‌ను కొనాలకి  ఇంకొకరు, టీ అమ్మి ఆడి  కారును కొనుగోలు చేశారా? లేక ఆడి కారు కొన్నాక టీ అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందా అని మరికొందరు, చాయ్‌  అమ్మి దేశ ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటున్నాడు  అంటూ వ్యాఖ్యానించడం  విశేషం.  కారులో కూర్చొని టీ తాగితే 100 రూపాయలు ఖర్చవుతుందని ఓ వ్యక్తి చెప్పగా, టీ అమ్మడం మంచి బిజినీస్ అని మరొకరు కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రితం బీహార్ విద్యార్థి టీ స్టాల్ వార్తల్లో నిలిచింది. ఫరీదాబాద్‌లో బీటెక్ చాయ్ వాలీ పేరుతో బీటెక్ విద్యార్థి టీ విక్రయిస్తున్నాడు. 

ఈ కుర్రాళ్ల స్టైలే వేరు

ఈరోజుల్లో చాలామంది కుర్రాల్లు ఓ మంచి ఉద్యోగం వచ్చింది కదాని ఆరామ్ గా ఉండటంలేదు. వీలైతే కాదు వీలు చేసుకుని రెండు మూడు ఉద్యోగాలు చేయటానికి కూడా వెనుకాడటంలేదు. అలా వీలుకాకపోతే సైడ్ బిజినెస్ గా మరో ఆదాయ మార్గం ద్వారా కూడా డబ్బులు సంపాదించేస్తున్నారు. ఆ మధ్య లాక్ డౌస్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా రెండు మూడు కంపెనీల్లో ఉద్యోగాలు చేసిన రెండు చేతులా కాదు ఏకంగా నాలుగు ఆరు చేతులతో సంపాదించేశారు. మరికొంతమంది సైడ్ బిజినెస్ గా  కోళ్ల ఫామ్ లు, పండ్లు, కూరగాయల పెంపకం వంటివి చేసి చక్కటి ఆదాయాలను పొందారు. ఈ ముంబై కుర్రాల్ల స్టైల్ వేరే అయినా అదనపు ఆదాయమే కామన్ పాయింట్ గా ఉంది కదా..!