పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై కరెప్షన్ కేసులు

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై కరెప్షన్ కేసులు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై మరో రెండు అవినీతి కేసులు నమోదు చేసేందుకు ఆ దేశ యాంటీ గ్రాప్ట్ బాడీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే పలు అవినీతి కేసులు నవాజ్ షరీఫ్ ఫ్యామిలీపై నమోదై ఉన్నాయి. తాజాగా ఆయనపై మరో రెండు అవినీతి కేసులు నమోదు చేయనున్నట్లు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) డైరెక్టర్‌ జనరల్‌ షహ్జాద్‌ సలీం తెలిపారు. ఐతే ఈ కేసులను అకౌంటబిలిటీ కోర్టులో దాఖలు చేయడానికి ముందు ఈ లాహోర్ ఛైర్మన్ జస్టిస్ జావేద్ ఇక్బాల్‌ అనుమతి కోసం పంపుతామని అధికారులు తెలిపారు. ‘షరీఫ్ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసులు ఎన్‌ఏబీ చైర్మన్ ఆమోదం పొందాల్సి ఉన్నాయి. షరీఫ్ 1986 లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీర్ షకీలూర్ రెహ్మాన్ అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా లాహోర్‌లో భూమిని కేటాయించారు. ఆ కేసుకు సంబంధించి మీర్ షకీలూర్ రెహ్మాన్‌ను ఈ ఏడాది మార్చి 12న ఎన్ఎబీ అరెస్ట్ చేసింది. అదే కేసులో నవాజ్ షరీఫ్ పైన కేసులు నమోదు చేయన్నారు. గతంలోనూ నవాజ్ షరీఫ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై మనీలాండరింగ్‌, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయి.