అంబేద్కర్ కాలేజీలో.. మహిళలకు టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ:డాక్టర్ సరోజ వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ కాలేజీలో.. మహిళలకు టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ:డాక్టర్ సరోజ వివేక్ వెంకటస్వామి
  • అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్ కరస్పాండెంట్  డాక్టర్ సరోజ వివేక్

ముషీరాబాద్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే స్వతంత్రంగా ప్రయాణించే సామర్థ్యం ఎంతో అవసరమని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్ పేర్కొన్నారు. మహిళల కోసం అంబేద్కర్ కాలేజీలో ప్రముఖ మహిళా సాధికారత సంస్థ మావో మోటార్ సైకిల్ విమెన్ కొలాబరేషన్స్ ఆధ్వర్యంలో టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా డాక్టర్ సరోజ వివేక్ మాట్లాడుతూ.. మహిళలకు డ్రైవింగ్​ నేర్పించడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. డ్రైవింగ్ అనేది కేవలం నైపుణ్యం మాత్రమే కాదని, మహిళల ఆత్మవిశ్వాసం, స్వయం సమృద్ధికి దోహదపడే సాధనమని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో మహిళలు మరింత ముందుకు సాగేందుకు డ్రైవింద్​ దోహదం చేస్తుందని చెప్పారు. 

అత్యంత తక్కువ ఫీజుతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లెర్నింగ్ లైసెన్స్ పొందేందుకు కూడా సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.