- రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం
- రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో ఘటన
షాద్ నగర్, వెలుగు: రైలు ఢీకొని ఇద్దరు యువతులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. నందిగామ శివారులో కట్టెల మోపుతో ప్రీతి (22), కుమారి (15) రైల్వే ట్రాక్ దాటుతున్నారు. ఈ క్రమంలో 'హంద్రీ ఎక్స్‌ప్రెస్' రైలు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని అదే రైలులో షాద్ నగర్‌లోని ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు ప్రీతి స్వస్థలం బిహార్ రాష్ట్రం, భోజ్‌పూర్ జిల్లాలోని సేలంపూర్ గ్రామం కాగా.. కుమారిది దర్భంగా జిల్లాలోని పుట్టాయి గ్రామంగా పోలీసులు గుర్తించారు. వీరి కుటుంబాలు 8 ఏళ్ల క్రితమే నందిగామకు వలస వచ్చినట్లు తెలిపారు. మృతురాలు కుమారి 8వ తరగతి చదువుతున్నట్లు పేర్కొన్నారు.
