హైదరాబాద్లో FIFA ఫైనల్ పండగ.. ఈ రెండ్రోజులు సిటీలో బార్లు తెల్లార్లు ఓపెన్లోనే..!

హైదరాబాద్లో FIFA ఫైనల్ పండగ.. ఈ రెండ్రోజులు సిటీలో బార్లు తెల్లార్లు ఓపెన్లోనే..!

అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య FIFA ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్ జరగనున్న క్రమంలో తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జులై 19న అంటే ఆదివారం.. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మధ్య థర్డ్ ప్లేస్ కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది.

జులై 20న సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య ఫిఫా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇవి రెండూ కీలక మ్యాచులు కావడంతో.. జూలై 19, 20 తేదీల మధ్య వేకువజామున 3 గంటల వరకు మద్యం విక్రయించడానికి తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది.

బార్‌లు, క్లబ్‌లు, మైక్రోబ్రూవరీలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి ఉంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై 18వ తేదీ అర్ధరాత్రి నుంచి వేకువజామున 4.30 గంటల వరకూ, జులై 19, 20 తేదీల్లో వేకువ జామున 3 గంటల వరకూ హైదరాబాద్ సిటీలో మద్యం అమ్మకాలు కొనసాగించవచ్చని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. వైన్స్ యథావిధిగా షెడ్యూల్ ప్రకారం మూసివేస్తారు. బార్లలో మాత్రమే మద్యం విక్రయాలు జరుగుతాయి.

Also Read : అర్జెంటీనాకు ఆ రిఫరీ అంటేనే దడ..