కీసర, వెలుగు: కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగారం డివిజన్‌లో తనపై సినీ నటుడు కాట్రాజ్ అలియాస్ సుప్రీత్‌రెడ్డి దాడి చేసినట్లు ఉబర్ క్యాబ్ డ్రైవర్ శ్రీహరి ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వనస్థలిపురం నుంచి కుందన్‌పల్లికి ప్రయాణికులను తీసుకెళ్లి, వారిని దింపిన అనంతరం నాగారం సాయిబాబా ఆలయం సమీపంలోని ఓ గల్లీ వద్ద వాహనాన్ని నిలిపి మరో కిరాయి కోసం వేచి ఉన్నాడు.
ఈ సమయంలో అదే గల్లీ నుంచి వచ్చిన కాట్రాజ్ క్యాబ్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం శ్రీహరిపై దాడి చేసి, అతని మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు. స్థానికులు జోక్యం చేసుకొని ఇద్దరికీ సర్ది చెప్పడంతో కాట్రాజ్ మొబైల్ ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
