- అదానీ గ్రూప్ తో కలిసి ఏర్పాటు చేసే ఆలోచన
న్యూఢిల్లీ: క్యాబ్ సర్వీస్‌లను అందించే గ్లోబల్ కంపెనీ ఉబర్, తమ మొదటి డేటా సెంటర్‌ను అదానీ గ్రూప్‌తో కలిసి ఇండియాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో గౌతమ్ అదానీని కలిసిన తర్వాత ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.
ఈ కొత్త డేటా సెంటర్ సాయంతో తమ టెక్నాలజీని టెస్ట్, అమలు చేస్తామని తెలిపారు. ఈ సెంటర్ ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
"భారత్ నుంచి ప్రపంచం కోసం" అనే నినాదంతో భారీ స్థాయిలో కార్యకలాపాలను నిర్మించడానికి ఈ పెట్టుబడి దోహదపడుతుందని దారా పేర్కొన్నారు.
