జీ7 సమ్మిట్ ‌కు రావాలంటూ ప్రధాని మోడీకి ఆహ్వానం

జీ7 సమ్మిట్ ‌కు రావాలంటూ ప్రధాని మోడీకి ఆహ్వానం
ఈ ఏడాది జూన్ లో జరగనున్న G7 సదస్సుకు హాజరుకావాలని ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. బ్రిటన్ లోని కార్న్ వాల్ రీజియన్ లో ఈ సారి G7 సదస్సు నిర్వహిస్తున్నారు. భారత్ తో పాటు.. సభ్య దేశాలన్నింటికి బ్రిటన్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సారి సదస్సుకు సభ్య దేశాలతో పాటు.. ఆస్ట్రేలియా, దక్షిణకొరియాను ఆహ్వానించారు. ఇక.. ఈ సదస్సు కంటే ముందే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారమైతే ఈ నెల 26న గణతంత్రదినోత్సవ వేడుకలకు బోరిస్ జాన్సన్ హాజరుకావాల్సి ఉంది. బ్రిటన్ లో కరోనా ఉధృతి క్రమంలో ఆయన టూర్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో G7 సదస్సుకు ముందు బోరిస్ జాన్సన్ భారత్ రానున్నారు.