చైనా వైరస్​పై టెన్షన్​ వద్దు ..  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

చైనా వైరస్​పై టెన్షన్​ వద్దు ..  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: చైనాలో స్పీడ్​గా వ్యాపిస్తున్న హెచ్9ఎన్2(ఏవియన్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెంజా) వైరస్, చిన్న పిల్లల్లో పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. వాటితో మన దేశంలో పిల్లలకు అంతగా ప్రమాదంలేదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.డబ్ల్యూహెచ్​వో రిలీజ్ చేసిన అడ్వైజరీని కూడా ఫాలో అవుతున్నట్లు పేర్కొంది. ‘‘చైనాలోని పిల్లల్లో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి ఇప్పటి వరకు అసాధారణ కేసులేవీ నమోదు కాలేదు’’ అని ప్రభుత్వం చెప్పింది.

డబ్ల్యూహెచ్​వో ప్రకటన ప్రకారం.. హెచ్​9 ఎన్​2 వైరస్ కు మనిషి నుంచి మనిషికి  సోకే అవకాశం చాలా తక్కువ. ఈ వైరస్ తో మరణాల రేటు కూడా తక్కువేనని కేంద్రం పేర్కొంది. మరోవైపు, కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసిన విషయం గుర్తు చేసింది