
హైదరాబాద్, వెలుగు: మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ‘యూనియన్ వరల్డ్ హెల్త్ కాన్ఫరెన్స్ ఆన్‌లంగ్ హెల్త్’ 50వ సదస్సును నగరంలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అక్టోబర్ 30 నుం చి నవంబర్ 2 వరకు జరగనున్న ఈ సమావేశానికి 130 దేశాల నుంచి డాక్టర్లు , సైం టిస్టులు, ప్రముఖులు సహా 3 వేల మంది హాజరవనున్నారు. టీబీ, శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సి న చర్యలపై చర్చిస్తారు. సదస్సు వివరాలను యూనియన్(ది ఇంటర్నేషనల్యూనియన్ అగైనస్ట్ టీబీ, లంగ్ డిసీజ్) ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ జోస్ లూయిస్ కాస్ర్టో బుధవారం వివరిం చారు. ‘‘2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలిం చాలన్న ఇండియా లక్ష్యానికి సదస్సు దోహద పడుతుంది. ప్రపంచవ్యా ప్తంగా టీబీ బారిన పడుతున్న నలుగురిలో ఒకరు దేశంలోనే ఉంటున్నారు. ఇక్కడ వాయు కాలుష్యం , టొబాకో వినియోగం ఎక్కువ. ఊపిరితిత్తుల వ్యా ధుల నివారణలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది’’ అన్నారు.