సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

హైదరాబాద్, వెలుగు: సిటీలో శుక్రవారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం మొదలైంది. రాజేంద్రనగర్, శివరాంపల్లి, శాస్త్రిపురం, మైలార్‌‌దేవ్‌పల్లి, టాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, లక్డీకపూల్, కూకట్ పల్లి, గచ్చిబౌలి  తదితర ప్రాంతాల్లో వాన పడింది.

రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా  రాజేంద్రనగర్‌‌లో 8.7సెం.మీ, శివరాంపల్లిలో 6.6సెం.మీ వర్షపాతం నమోదైంది.  మరో మూడ్రోజులు గ్రేటర్ పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.