మూడు పెళ్లిళ్లు చేసుకున్న పాస్టర్ ఉప్పల్‌లో అరెస్ట్

మూడు పెళ్లిళ్లు చేసుకున్న పాస్టర్ ఉప్పల్‌లో అరెస్ట్

ఉప్పల్ లో మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన పాస్టర్ అరెస్ట్ చేశారు పోలీసులు. గాస్పల్ చర్చికి పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు.. అమాయక ఆడపిల్లను టార్గెట్ చేస్తూ.. చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగదీసుకొని మోసం చేస్తున్నాడు.  టీవీ ఛానల్లో మత ప్రభోధకుడిగా కూడా పని చేస్తున్నాడు జోసఫ్. పాస్టర్ ఆగడాలపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు MRPS నాయకులు. అలాగే  లైంగిక దాడి చేసి, బెదిరింపులకు దిగుతున్నాడని ముగ్గురు అమ్మాయిలు జోసఫ్ పై ఫిర్యాదు చేశారు. పాస్టర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.