న్యూఢిల్లీ: అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో మూడేళ్ల గరిష్టానికి చేరింది. మార్చిలో నమోదైన 3.3 శాతం నుంచి 3.8 శాతానికి పెరిగింది. హార్మూజ్ జలసంధి మూతపడడంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం అమెరికా కన్జూమర్లపై పడుతోంది. ఈ దేశంలో ఇంధన ధరల పెరుగుదలను సూచించే ఇండెక్స్ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 17.9 శాతం పెరిగింది. అంతేకాకుండా ఆహార పదార్థాల ధరలు 3.2 శాతం మేర పెరిగాయి.
ఆహార, ఇంధన ధరలను మినహాయించిన కోర్ సీపీఐ మార్చిలోని 2.6 శాతం నుంచి ఏప్రిల్‌లో 2.8 శాతానికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్దేశించుకున్న 2 శాతం టార్గెట్ కంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటంతో, ధరలను నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కరోనా సంక్షోభం తర్వాత నుంచి ధరలను కంట్రోల్ చేయడంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
