అవీ–ఇవీ:  ముల్లెట్​ హెయిర్ ​స్టయిల్​తో రికార్డుల్లోకి..

అవీ–ఇవీ:  ముల్లెట్​ హెయిర్ ​స్టయిల్​తో రికార్డుల్లోకి..

అమెరికాలోని టెన్నెస్సీలో ఉండే టామి మానిస్​ అనే ఆవిడ తన తల వెనక జుట్టును 1990 నుంచి ఇప్పటివరకు కత్తిరించుకోలేదు. అంటే దాదాపు 33 ఏండ్లు జుట్టు మీద కత్తెర పెట్టలేదన్నమాట. దాంతో ఆ జుట్టు 172.72 సెంటీమీటర్లు అంటే ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు పెరిగింది. 58 ఏండ్ల మానిస్​1980లో జుట్టు పెంచుకోవాలని అనుకుంది. అదికూడా ఒక వీడియో చూసి ఇన్​స్పైర్​ అయ్యి. ఆమె చూసిన వీడియోలో ఆ సింగర్​కు ర్యాట్​టెయిల్​ (ఎలుక తోకలాంటి) హెయిర్​ స్టయిల్​ ఉందట. ‘‘అలాంటి హెయిర్​ స్టయిల్​ నాక్కూడా కావాలి అనిపించింది. దాంతో 1989లో ఒక బార్బర్​ ర్యాట్​టెయిల్​ హెయిర్​కట్​ చేసుకోమని నన్ను ఎలాగోలా ఒప్పించాడు.

కానీ ఆ హెయిర్​స్టయిల్​ చేయించుకున్నాక నాకు చాలా బాధనిపించింది. దాంతో జుట్టు మళ్లీ పెంచుకోవాలి అనే గట్టి నిర్ణయం తీసుకున్నా. అలా చూసుకుంటే1990 ఫిబ్రవరి 9వ తేదీ నాజుట్టు అఫీషియల్​ బర్త్​డే. అప్పటినుంచి నా జుట్టు పెంచుతూనే ఉన్నా. అదికూడా ముల్లెట్(మడవ చేప)​ హెయిర్​ స్టయిల్​. అది ఇప్పుడు నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చి పెట్టింది. నన్ను గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కించింది. ప్రపంచంలోనే పొడవైన ముల్లెట్ హెయిర్​ స్టయిల్​​ నాది. నా జుట్టు ఇంత పొడవు ఉంటుందనే విషయం ఎదురుగా ఉన్న వాళ్లకు తెలియదు. వాళ్లు నా వెనక్కి వచ్చి చూస్తే కానీ నా అందమైన ముల్లెట్ హెయిర్​ స్టయిల్​ గురించి తెలియదు” అంటూ నవ్వుతూ చెప్పింది.