పాలమూరులో రెండోరోజు పర్యటించారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ( జూన్ 5 ) కరివెన ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్. ఇండియా మొత్తంలో 60 శాతం తెలంగాణలోనే వడ్లను కొనుగోలు చేశామని అన్నారు. యాసంగి పంట ధాన్యం కొనుగోళ్లపై త్వరలోనే ప్రెస్ నోట్ రిజిజ్ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశామని అన్నారు. వడ్ల కొనుగోళ్ల కోసం రూ.16 వందల కోట్లు అదనంగా ఖర్చు చేశామని అన్నారు మంత్రి ఉత్తమ్.
రెండు రోజులుగా పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించామని..ఐదేళ్ళలో పాలమూరు ప్రాజెక్టులకే ఎక్కువ ఖర్చు చేస్తామని అన్నారు. పాలమూరులో ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెరగనుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు నిర్మించారని... ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పట్టించుకోలేదని..జూరాల నుంచి శ్రీశైలం నీటిని తరలించడమే బ్లండర్ మిస్టేక్ అని అన్నారు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ పూర్తి కాలేదని...SLBC, డిండి, సీతారామ ప్రాజెక్టులేవీ పూర్తి కాలేదని అన్నారు మంత్రి ఉత్తమ్.
బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కూలిపోయిందని అన్నారు. రూ. లక్షా 84 వేల కోట్లు ఖర్చు చేసి నమత్రపు ఆయకట్టు నిర్మించారని అన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా జలాల్లో నీటి హక్కుల కోసం KRMBలో పోరాడుతున్నామని అన్నారు.
