భార‌తీయ వైద్య విద్యార్థుల‌ను ఆదుకున్న ఉజ్బెకిస్థాన్

భార‌తీయ వైద్య విద్యార్థుల‌ను ఆదుకున్న ఉజ్బెకిస్థాన్
  •  ప్రత్యేకంగా 2వేల ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
  •  500 మందిని చేర్చుకున్న తాష్కెంట్ మెడిక‌ల్ అకాడ‌మీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో న‌ష్టపోయిన భారతీయ వైద్య విద్యార్థులను ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం ఆదుకుంది. ఇండియన్ స్టూడెంట్స్ కు 2వేల సీట్లు కేటాయించింది. ఈ క్రమంలో సోమాజిగూడలో నిర్వహించిన  ఓ కార్యక్రమంలో ఎంబీబీఎస్ విద్యార్థులు తాము వైద్య విద్యకు దూరం కాకుండా తక్కువ ఖర్చుతో 500 మంది భవిష్యత్తు కాపాడినందుకు ఆ దేశ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. పరిమిత సీట్లు, అధిక ఫీజుల కారణంగా చాలా మంది మధ్య తరగతి విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిని సాకుగా చేసుకొని కొంద‌రు దళారులు విద్యార్థులను తప్పుదోవ పట్టించి, మోసం చేస్తున్నారని అన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన టీఎంఏ తన వ్యూహాత్మక భాగస్వామి నియో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ తో కలిసి హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో దక్షిణాసియా ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తంచేశారు.