ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకున్న డాక్టర్: హనీమూన్ టూ హోమ్ ఐసోలేషన్

ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకున్న డాక్టర్: హనీమూన్ టూ హోమ్ ఐసోలేషన్

ఈ ఫొటోలోని అందమైన జంటకు ఫిబ్రవరి 14న పెళ్లయింది. ఇద్దరూ డాక్టర్లే. పెళ్లి తర్వాత కొద్ది రోజులు హాస్పిటల్ డ్యూటీకి సెలవు పెట్టి.. సరదాగా విహారానికి వెళ్లారు. హాయిగా ఎంజాయ్ చేద్దామని హనీమూన్ ట్రిప్ వేశారు. ఆ జాలీ టైమ్ ముగిశాక ఊహించని విధంగా వారిద్దరూ ఒకరిని ఒకరు కలవకూడని పరిస్థితిలో పడ్డారు. 14 రోజుల పాటు యూరప్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చింది ఈ డాక్టర్ల జంట. ఆ దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉండడంతో ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి. దీంతో 14 రోజుల పాటు వారు ఎవరినీ కలవకూడదు.

డాక్టర్ సిద్ధార్థ్ జై సింగ్.. మహారాష్ట్రలోని పుణేలో యూరాలజీ (ఎంసీహెచ్) చదువుకుంటూ.. వైద్యుడిగా పని చేస్తున్నాడు. డాక్టర్ మోనికా.. గోవాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిగా వర్క్ చేస్తోంది. ఈ ఇద్దరూ ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత హనీమూన్ కోసం యూరప్ వెళ్లారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెథర్లాండ్స్ లలో ట్రిప్ వేశారు. 14 రోజుల పాటు ఫుల్ గా ఎంజాయ్ చేసి మార్చి 5న ఇండియాలో లాండ్ అయ్యారు. ముంబై ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేయగా.. కరోనా సింప్టమ్స్ ఏవీ కనిపించలేదు. దీంతో పుణేలో తను వర్క్ చేసే హాస్పిటల్ కు వచ్చేశాడు డాక్టర్ సిద్ధార్థ్. కానీ, ఐదు రోజుల తర్వాత అతడికి జలుబు, తలనొప్పి కనిపించింది. దీంతో ఈ విషయాన్ని తాను హాస్పిటల్ లో సీనియర్లకు చెప్పానని, వారు తనను హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారని చెప్పాడు సిద్ధార్థ్. ఐసోలేషన్ అని చెప్పగానే భయపడాల్సిందేమీ లేదని, దీని వల్ల ఇతరులకు కూడా మేలు చేసినట్లవుతుందని అన్నాడు.

ఐసోలేషన్ లో ఆ మధుర స్మృతులతో.. టైమ్ పాస్..

సిద్ధార్థ్ ఐసోలేషన్ లో జబ్బు గురించి ఆలోచించుకుంటూ భయాందోళన చెందకుండా రకరకాల మార్గాల్లో టైమ్ స్పెండ్ చేస్తున్నాడని అతడి భార్య మోనికా చెప్పింది. హనీమూన్ లో తీసుకున్న ఫొటోలను చూస్తూ ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ గడుపుతున్నాడని తెలిపింది. సోషల్ మీడియాలో ఇతరులకు టిప్స్ ఇస్తున్నాడని చెప్పింది. క్వారంటైన్ అని చెప్పగానే భయపడిపోవాల్సిన అవసరం లేదని సాధారణ ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని పేర్కొంది. మనతో పాటు ఇతరులను కూడా కాపాడే మార్గమని తెలుసుకోవాలని చెప్పంది మోనికా.