రాఘవను ఐదు రోజుల తర్వాత పట్టుకున్న పోలీసులు

రాఘవను ఐదు రోజుల తర్వాత పట్టుకున్న పోలీసులు
  • ఏపీ బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదుపులోకి తీసుకున్నం
  • కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్​ ప్రకటన
  • పార్టీ నుంచి  సస్పెండ్ చేసిన టీఆర్ఎస్
  • రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు..
  • రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు
  • అట్టుడికిన కొత్తగూడెం, పాల్వంచ.. పలు పార్టీల లీడర్ల అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాఘవ వేధింపులు భరించలేక పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మాహుతి చేసుకున్న ఐదురోజుల తర్వాత పట్టుకున్నారు. తెలంగాణ, ఏపీ బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఎస్పీ సునీల్ దత్​ ప్రకటించారు. రాఘవను అరెస్టు చేసేందుకు ఎనిమిది స్పెషల్​టీమ్​లు రెండు రోజులుగా తెలంగాణ, ఏపీలో గాలించాయి. ఏపీలోని ఏలూరు-– వైజాగ్ మార్గంలో రాఘవను అరెస్ట్ చేశారని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ ఏపీ సరిహద్దు ప్రాంతమైన చింతలపూడి పరిసరాల్లో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

మరో కేసులో లొంగిపోవాలంటూ నోటీసులు
ఫైనాన్షియర్ మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో వనామా రాఘవ సరెండర్​ కావాలంటూ పోలీసులు పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటికి నోటీసులు అంటించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 లోగా తన ఆఫీసులో లొంగిపోయి, ఎంక్వైరీకి సహకరించాలని అడిషనల్​ ఎస్పీ శబరీశ్‌‌ పేరుతో నోటీస్ జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో వనమా రాఘవ అనుచరులు, పీఏలు, పలువురు టీఆర్ఎస్ లీడర్లను పోలీసులు విచారించారు.

కొత్తగూడెం బంద్ విజయవంతం
రాఘవను అరెస్టు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. రోడ్డెక్కి నిరసనలు తెలిపాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో చేపట్టిన బంద్ సక్సెస్​అయ్యింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలని, రాఘవను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్ ఎదుట ధర్నా చేసేందుకు బయలుదేరిన బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​కోనేరు సత్యనారాయణతోపాటు ఆపార్టీ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెం బస్టాండ్ దగ్గర సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ లీడర్లు నిరసన చేపట్టి.. బస్సులను ఆపేందుకు యత్నించగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని ఎమ్మెల్యే ఇంటి ముందు వైఎస్​ఆర్‌‌‌‌టీపీ లీడర్లు ధర్నా చేశారు. అరెస్టయిన లీడర్లను కొత్తగూడెంలోని వన్​టౌన్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. దీంతో వివిధ పార్టీల నేతలు స్టేషన్​లోనే ధర్నా చేశారు.

టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్
వనమా రాఘవ వ్యవహారంతో పార్టీకి డ్యామేజీ జరుగుతోందని భావించిన టీఆర్ఎస్ హైకమాండ్ శుక్రవారం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. సీఎం కేసీఆర్​సూచనల మేరకు వనామా రాఘవను టీఆర్ఎస్​నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ప‌‌ల్లా రాజేశ్వర్​రెడ్డి, పార్టీ ఖ‌‌మ్మం వ్యవహారాల ఇన్​చార్జి నూక‌‌ల న‌‌రేశ్ రెడ్డి ప్రకటించారు.